Hyderabad : నేడు హైదరాబాద్ లో అటువైపునకు వెళితే ఇరుక్కుపోయినట్లే
నేడు హైదరాబాద్ లో కొన్ని చోట్ల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
నేడు హైదరాబాద్ లో కొన్ని చోట్ల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వార్ 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుండటంతో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కథానాయకులుగా నటించిన వార్ 2 సినిమా ప్రీ రిలీజ్ వేడుక నేడు హైదరాబాద్ లో జరగనుంది. దీంతో పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ట్రాఫిక్ ఆంక్షలు...
వార్ 2 మూవీ ప్రీ రిలీజ్ వేడుకలు యూసఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరగనుండటంతో అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారని భావించి సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయనినగర పోలీసులు తెలిపారు. కేవీబీఆర్ స్టేడియం వైపునకు ఎవరూ వెళ్లవద్దని సూచించారు.