గుడ్ న్యూస్...హైదరాబాద్ టు విజయవాడ 99 రూపాయలకే టిక్కెట్

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేందుకు కేవలం 99 రూపాయలే ఛార్జీలు వసూలు చేస్తున్నారు

Update: 2025-02-07 02:00 GMT

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలంటే కనీసం ఐదు వందల రూపాయలు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే ఏసీ బస్సుల్లో ప్రయాణించాలంటే వెయ్యిరూపాయల వరకూ వెచ్చించాల్సి ఉంటుంది. కానీ ఈ బస్సుల్లో వెళితే కేవలం 99 రూపాయలకే హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకెళ్లనున్నారు. ఎలక్ట్రిసిటీ వాహనాలను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం ఈటీవో మోటార్స్ తో కలిపి ప్లిక్స్ బస్ ఇండియాను అందుబాటులోకి తెచ్చింది.

ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభం సందర్భంగా...
ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభోత్సవం సందర్బంగా ఆ సంస్థ ఈ ఆఫర్ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య ఈ బస్సులు నడుస్తాయని, ఆ తర్వాత విశాఖకు కూడా తమ బస్సులను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ బస్సుల్లో ఒక్కదాంట్లో నలభై తొమ్మిది మంది ప్రయాణించే వీలుంది. అయితే ఈ బస్సులు ప్రారంభమయిన తొలి నాలుగు రోజులు హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం 99 రూపాయలు మాత్రమే ఛార్జీలు వసూలు చేస్తామని తెలిపారు.


Tags:    

Similar News