కాముని చెరువు కబ్జాపై.. స్పందించిన మంత్రి కేటీఆర్

Update: 2022-11-14 06:48 GMT

హైదరాబాద్ మహా నగరంలో ఎన్నో చెరువులను పూడ్చేసి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లను కడుతూ ఉన్న సంగతి తెలియసిందే. గతంలో అలా కబ్జా చేసి చెరువులను, సరస్సులను మూసేయడం వలన.. చిన్న పాటి వర్షం పడినా హైదరాబాద్ మహా నగరం మునిగిపోతూ ఉంది. ప్రభుత్వాలు ఓ వైపు చర్యలు తీసుకుంటున్నా.. కబ్జా రాయుళ్లు మాత్రం తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. తాజాగా హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఉన్న కాముని చెరువును కూడా మింగేయాలని చూస్తున్నారు కొందరు. ఈ విషయాన్ని ప్రముఖ జర్నలిస్ట్ సుధాకర్ ఉడుముల ట్విట్టర్ ద్వారా తెలంగాణ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. చెరువును మింగేస్తున్నారని ఫోటోలను కూడా అప్లోడ్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సుధాకర్ ఉడుముల మరో ట్వీట్ లో గత కొన్ని సంవత్సరాలుగా ఈ కబ్జా బాగోతం జరుగుతున్నా పట్టించుకోలేదని.. కేవలం రెండు ఎఫ్ఐఆర్ లు మాత్రమే నమోదయ్యాయని.. అది కూడా ట్రక్ డ్రైవర్ లను అదుపులోకి తీసుకున్నారని వివరించారు. కేటీఆర్ ఆ ట్వీట్ పై స్పందిస్తూ.. నిబంధనలను మరింత కఠినతరం చేస్తామని, ఈ కబ్జాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.


Tags:    

Similar News