‌‌‌Hyderabad : నేడు కూడా హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్ లో నేడు కూడా భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది

Update: 2024-06-07 04:50 GMT

Ap weather updates

హైదరాబాద్ లో నేడు కూడా భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. నగరంలో భారీ వర్షం కురిసే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

రెండు రోజుల నుంచి...
గత రెండు రోజుల నుంచి హైదరాబాద్ నగరంలో భారీ వర్షం నమోదవుతుంది. రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. ఈదురుగాలులు వీస్తుండటంతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పలుచోట్ల విద్యుత్తు సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడుతుంది. ఈరోజు హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశముందని, ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది. ఈ నెల 10వ తేదీ వరకూ వర్షాలు పడతాయని తెలిపింది.


Tags:    

Similar News