మరో రెండురోజులు భారీ వర్షాలే

ఉపరితల ద్రోణి కారణంగా మరో రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Update: 2022-10-09 03:50 GMT

ఉపరితల ద్రోణి కారణంగా మరో రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న నాలుగు గంటల పాటు కురిసిన వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. క్యుములోనింబంస్ మేఘాల కారణంగా ఒక్కసారి వర్షం పడటంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతంలోని ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో కొందరు అన్ని వస్తువులను వదిలేసి బయటకు పరుగులు తీశారు.

అత్యధికంగా...
అత్యధికంగా షేక్ పేటలో 13.6 సెంమీల వర్షపాతం నమోదయింది. మాదాపూర్ లో 12.7, జూబ్లీహిల్స్ లో 11.3 సెంమీలు, హైదర్ నగర్ లో 11, బాచుపల్లిలో 10.2 సెంమీలు, గచ్చిబౌలిలో 9.7, మణికొండలో 8.2, మియాపూర్ లో 8.1, కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ లో 7.9, బాలానగరలో లో 7.2, గాజుల రామారంలో 6.4 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజుల పాటు వర్షాలు తప్పవని సూచించింది.


Tags:    

Similar News