శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అనుకూలించని వాతావరణం
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో వాతావరణం అనుకూలించకపోవడంతో అనేక విమానాలు దారి మళ్లించారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో వాతావరణం అనుకూలించకపోవడంతో అనేక విమానాలు దారి మళ్లించారు. ఉదయం నుంచి వర్షం పడుతుండటంతో పాటు మంచు కూడా కురుస్తుండటంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాల ల్యాండింగ్ సాధ్యపడటం లేదు. కొన్నివిమానాలు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉన్నా వాతావరణం కారణంగా ఇక్కడ ల్యాండింగ్ జరగడం లేదు.
విమానాల దారిమళ్లింపు...
అనుకూలించని వాతావరణ పరిస్థితుల కారణంగా పలు విమానాలను దారి మళ్లిస్తున్నారు. మూడు విమానాలు అత్యవసరంగా బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించారు. వాతావరణం అనుకూలించిన తర్వాత మాత్రమే తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు. అయితే ప్రయాణికులు హైదరాబాద్ లో దిగాల్సి ఉండగా, బెంగళూరుకు వెళ్లడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు.