గ్రీన్ చానెల్... 15 నిమిషాల్లో... గుండె, ఊపిరితిత్తులు?
బ్రెయిన్ డెడ్ అయిన ఒక వ్యక్తి నుంచి ఊపిరితిత్తులు, గుండెను గ్రీన్ ఛానెల్ ను ఏర్పాటు చేసి పదిహేను నిమిషాల్లో తరలించారు.
బ్రెయిన్ డెడ్ అయిన ఒక వ్యక్తి నుంచి ఊపిరితిత్తులు, గుండెను గ్రీన్ ఛానెల్ ను ఏర్పాటు చేసి పదిహేను నిమిషాల్లో తరలించారు. హైదరాబాద్ లోని కామినేని ఆసుపత్రి నుంచి బేగంపేట్ లోని కిమ్స్ కు వీటిని తరలించారు. బేగంపేట్ కిమ్స్ లో చికిత్స పొందుతున్న వారికి వీటిని అమర్చేందుకు పోలీసు అధికారులు గ్రీన్ చానెల్ ను ఏర్పాటు చేశారు.
కిమ్స్ కు....
కామినేని ఆసుపత్రి నుంచి బేగంపేట్ కిమ్స్ కు ఊపిరితిత్తులను, గుండెను కేవలం పదిహేను నిమిషాల్లో తరలించారు. ఎల్పీ నగర్ నుంచి బేగంపేట్ వరకూ రాచకొండ పోలీసులు గ్రీన్ ఛానల్ ను ఏర్పాటు చేశారు.