అసెంబ్లీలో నేడు కడియం కేసు విచారణ
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నేడు స్పీకర్ విచారణకు హాజరుకానున్నా
పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నేడు స్పీకర్ విచారణకు హాజరుకానున్నారు. ఎమ్మెల్యే కడియం అనర్హతపై బీఆర్‌ఎస్ ఇచ్చిన పిటిషన్ పై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ విచారణ చేపట్టనున్నారు. శాసనసభలోని స్పీకర్ కార్యాలయంలో బుధవారం ఉదయం 11 గంటలకు విచారణ జరగనుంది
ఇరువర్గాల వాదనలు...
ఈ మేరకు బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే కేపీ వివేకానందకు, ఎమ్మెల్యే కడియం శ్రీహరికి మంగళవారం స్పీకర్ నోటీసులు పంపించారు. దీంతో ఇరువురి తరుపున న్యాయవాదులు కూడా హాజరవుతున్నారు. వారు తమ వారి తరుపున వాదనలను వినిపించనున్నారు. ఇప్పటికే కడియం శ్రీహరి తాను పార్టీ మారలేదని అఫడవిట్ సమర్పించిన నేపథ్యంలో నేడు విచారణ జరగనుంది.