Jubleehills By Election : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ నేడు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది

Update: 2025-10-13 02:04 GMT

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. నేడు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నేటి నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ నెల 21వ తేదీ వరకూ అభ్యర్థుల నుంచి నామినేషన్లను అధికారులు స్వీకరించనున్నారు. ఈ నెల 24వ తేదీ వరకూ నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంటుంది. షేక్ పేట్ తహసిల్దార్ కార్యాలయంలో నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇక్కడే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

వచ్చే నెల 11న పోలింగ్...
వచ్చే నెల 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. 14వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ లు బరిలో ఉండనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రచారం ఇప్పటికే ప్రారంభమయింది. నామినేషన్ల సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Similar News