Hyderabad : ఫ్యాన్స్ తో నిండిపోయిన ఉప్పల్ స్టేడియం
ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ మరికాసేపట్లో ఉప్పల్ స్టేడియానికి చేరుకోనున్నారు.
ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ మరికాసేపట్లో ఉప్పల్ స్టేడియానికి చేరుకోనున్నారు. ఫలక్ నుమా హోటల్ లో ఉన్న మెస్సీ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలసి ఆయన ఉప్పల్ స్టేడియానికి బయలుదేరి వెళతారు. మెస్సీని చూసేందుకు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా అత్యధిక సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో ఉప్పల్ స్టేడియం కిక్కిరిసిపోయింది.
గ్రీన్ ఛానల్ ద్వారా...
పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 7.50 గంటలకు ఉప్పల్ స్టేడియానికి చేరుకోనున్న మెస్సీ రాత్రి 8.30 గంటల వరకూ మాత్రమే అక్కడ ఉంటారు. తర్వాత ఆయన ఫలక్ నుమా ప్యాలెస్ కు బయలుదేరి వెళతారు. మెస్సీని దగ్గర నుంచి చూసేందుకు పెద్దయెత్తున తరలి రావడంతో ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఉప్పల్ స్టేడియానికి మెస్సీ గ్రీన్ ఛానల్ ద్వారా రానున్నారు.