లొంగిపోయిన ప్రభాకర్ రావు

మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయారు

Update: 2025-12-12 06:05 GMT

మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. సిట్ అధికారుల ఎదుట ఆయన సరెండర్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావును లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన లొంగిపోయారు. వారం రోజుల పాటు ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణ చేయనున్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు...
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును విచారించనున్నారు. అయితే సుప్రీంకోర్టు ఆయనను ఫిజికల్ గా టార్చర్ చేయవద్దని, ఇంటి నుంచి భోజనం అందించాలని సుప్రీంకోర్టు తెలిపింది. చట్ట ప్రకారం దర్యాప్తు చేయాలని ఆదేశించడంతో నేటి నుంచి ప్రభాకర్ రావును సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ చేయనుంది.


Tags:    

Similar News