Telangana : అఖండ 2 మూవీ టిక్కెట్ల పెంపుపై హైకోర్టు ఆగ్రహం

అఖండ 2 టిక్కెట్ల రేట్లు పెంపుపై న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులు ఉల్లంఘించినందుకు హైకోర్టు డివిజనల్ బెంచ్ సీరియస్ అయింది

Update: 2025-12-12 07:35 GMT

అఖండ 2 టిక్కెట్ల రేట్లు పెంపుపై న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులు ఉల్లంఘించినందుకు హైకోర్టు డివిజనల్ బెంచ్ సీరియస్ అయింది. బుక్ మై షో లో ఇంకా ఆన్ లైన్ లో టిక్కెట్లను అమ్మడమేంటని ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వులన్నా లెక్కలేదా? అని ప్రశ్నించింది. తాము టిక్కెట్ల రేట్లను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఎందుకు ఉల్లంఘించారంటూ నిలదీసింది.

బుక్ మై షోలో కూడా...
అసలు న్యాయస్థానాలంటే లెక్కలేదా? అని ప్రశ్నించింది. బుక్ మై షోకు కూడా నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. టిక్కెట్ల రేట్లను ఎందుకు పెంచి విక్రయిస్తున్నారంటూ నిలదీసింది. సినిమా టిక్కెట్ల రేట్లను పెంచి వసూలు చేస్తున్నా అధికారులు ఏం చేస్తున్నారని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ 14 రీల్స్ డివిజనల్ బెంచ్ ను ఆశ్రయించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. కోర్టు థిక్కార నోటీసులు ఎందుకు ఇవ్వ కూడదని హైకోర్టు ప్రశ్నించింది.


Tags:    

Similar News