Hyderabad : న్యూఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీస్ ఆంక్షలివే

హైదరాబాద్ లో న్యూఇయర్ వేడుకలకు పోలీసులు ఆంక్షలు విధించారు

Update: 2025-12-13 07:41 GMT

హైదరాబాద్ లో న్యూఇయర్ వేడుకలకు పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబర్‌ 31వ తేదీ అర్ధరాత్రి నుంచి జనవరి 1 తేదీ వరకు అమలయ్యేలా త్రీ స్టార్ హోటల్స్ పైబడిన హోటళ్లు, క్లబ్బులు, బార్‌-కమ్‌-రెస్టారెంట్లు, పబ్బుల నిర్వహణపై మార్గదర్శకాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ శనివారం వెల్లడించారు. టికెట్‌తో కార్యక్రమాలు, ఈవెంట్లు నిర్వహించాలనుకునే యాజమాన్యాలు రాత్రి 1 గంట వరకు అనుమతి కోరితే, కనీసం 15 రోజుల ముందే హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు దరఖాస్తు చేయాలని స్పష్టం చేశారు.

భద్రత, నిబంధనల కట్టుదిట్టం
అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు. తెలంగాణ పబ్లిక్‌ సేఫ్టీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చట్టం–2013 ప్రకారం, ప్రతి సంస్థలో ఎంట్రీ, ఎగ్జిట్ ద్వారాల వద్ద సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని చెప్పారు. పార్కింగ్‌ ప్రాంతాల్లో కూడా రికార్డింగ్‌ సౌకర్యంతో సీసీటీవీలు ఉండాలని ఆదేశించారు. ట్రాఫిక్‌ నియంత్రణ, భద్రత కోసం తగిన సంఖ్యలో సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయాలని సూచించారు


Tags:    

Similar News