Rahul Gandhi : నేడు హైదరాబాద్ కు రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు హైదరాబాద్ కు రానున్నారు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు హైదరాబాద్ కు రానున్నారు. ప్రత్యేక విమానంలో బయలుదేరి రాహుల్ మధ్యాహ్నం 2.15 గంటలకు విమానాశ్రయానికి చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి నేరుగా తాజ్ ఫలక్ నుమా హోటల్ కు వెళ్లనున్నారు. అక్కడ కొందరు రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో సమావేశమవుతారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తారు.
ఉప్పల్ స్టేడియానికి వచ్చి...
అనంతరం సాయంత్రం ఏడు గంటలకు రాహుల్ గాంధీ ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ జరగనున్న ఫుట్ బాల్ మ్యాచ్ ను వీక్షిస్తారు. ఫుట్ బాల్ దిగ్గజ ఆటగాడు మెస్సీ వస్తుండటంతో ఆయనతో కాసేపు ముచ్చటిస్తారు. అనంతరం ఉప్పల్ స్టేడియం నుంచి బయలుదేరి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రాత్రి 10.15 గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెళతారు. రాహుల్ గాంధీ వస్తుండటంతో పెద్దయెత్తు కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు స్వాగతం పలకనున్నారు.