Hyderabad : హైదరాబాద్ లో వర్షం
హైదరాబాద్ లో ఈరోజు ఉదయం నుంచి వర్షం కురుస్తుంది. మోస్తరు వర్షంతో చికాకు పెడుతుంది.
Ap weather updates
హైదరాబాద్ లో ఈరోజు ఉదయం నుంచి వర్షం కురుస్తుంది. మోస్తరు వర్షంతో చికాకు పెడుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా ఈ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉదయం ఎనిమిది గంటల నుంచే చల్లటి వాతావరణం ఉండటంతో మార్నింగ్ వాకర్స్ బయటకు వచ్చేందుకు ఇబ్బంది పడ్డారు.
రహదారులు...
అదే సమయంలో వర్షం కూడా పడటంతో కార్యాలయాలకు వెళ్లే వాళ్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అటు భారీ వర్షం కాదు.. ఇటు చిన్న వర్షం కాకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు, రేపు కూడా తెలంగాణ అంతటా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. చిన్న పాటి వర్షానికే రోడ్లన్నీ జలమయమయ్యాయి.