హైదరాబాద్ లో డ్రైవర్ లెస్ బస్సులు
డ్రైవర్ అవసరం లేకుండా తిరిగే బస్సులను హైదరాబాద్ లోనే చూడొచ్చు.
డ్రైవర్ అవసరం లేకుండా తిరిగే బస్సులను హైదరాబాద్ లోనే చూడొచ్చు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్‌లో డ్రైవర్‌లెస్ మినీ బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. దేశంలోనే తొలిసారిగా ఒక విద్యాసంస్థ ప్రాంగణంలో పూర్తిస్థాయిలో డ్రైవర్‌రహిత బస్సులను వినియోగించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన 'టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్' అనే ప్రత్యేక పరిశోధన విభాగం ఈ సాంకేతికతను పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఆరు సీట్లు, పద్నాలుగు సీట్ల సామర్థ్యంతో రెండు రకాల విద్యుత్ బస్సులను క్యాంపస్‌లో నడుపుతున్నారు.