ఈ–కామర్స్ గోదాంలో పాడైన ఆహారం నిల్వ

శహర్‌ వ్యాప్తంగా 25 యూనిట్ల తనిఖీలు

Update: 2025-11-30 04:40 GMT

హైదరాబాద్: నగరంలో ఉన్న పలుసంఖ్యాక ఈ–కామర్స్ గోదాంలలో పండ్లు, కూరగాయలు సహా అనేక ఆహార పదార్థాలను పాడైన స్థితిలో నిల్వ చేస్తున్నట్లు ఫుడ్‌సేఫ్టీ విభాగం రెండు రోజులపాటు చేసిన తనిఖీల్లో బయటపడింది.

సెప్టెంబర్‌ 25, 26 తేదీల్లో అధికారులు మొత్తం 25 గోదాంలను పరిశీలించారు. 44 ఆహార నమూనాలను సేకరించారు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న మూడు యూనిట్లను అధికారులు సీజ్ చేశారు. మొత్తం 77 కిలోల పండ్లు, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలను పాడైనవిగా గుర్తించారు.

నగరంలో పనిచేస్తున్న చాలా ఈ–కామర్స్ సంస్థలు కేంద్ర గోదాంల నుంచే పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిల్వ విధానం సరిగా లేకపోవటం వల్ల పాడైపోయినవి వినియోగదారులకి చేరుతున్న సందర్భాలు ఎక్కువయ్యాయని పేర్కొన్నారు.

డెలివరీ సమయంలోనే తనిఖీ చేయండి

ఫుడ్‌సేఫ్టీ అధికారులు వినియోగదారులు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు డెలివరీ బాయ్ ఎదుటే పరిశీలించాలని సూచించారు. అతిగా  ఉండటం, ఊరటం, ఎండిపోయి ఉండటం, దెబ్బతినటం గమనిస్తే వెంటనే తిరస్కరించాలని చెప్పారు.

డెలివరీ సమయంలో పరిశీలించడం సాధ్యంకాకపోతే ప్యాకెట్ తెరిచే సమయంలో చిన్న వీడియో తీసుకోవాలని సూచించారు. పాడైనవి దొరికితే సంబంధిత ఈ–కామర్స్ సంస్థ కస్టమర్‌కేర్‌కు ఫోటో లేదా వీడియోతో ఫిర్యాదు పెట్టాలని సూచించారు.

గుడ్ల ఆర్డర్లకు ప్రత్యేక జాగ్రత్త

గుడ్లు ఆర్డర్ చేసినప్పుడు కార్టన్ తెరవటం కూడా వీడియోగా రికార్డ్ చేయాలని అధికారులు చెప్పారు. “ఒక్కటి–రెండు గుడ్లు పగిలినా విస్మరించకండి. ఫిర్యాదులు చేస్తేనే కంపెనీలు బాధ్యత తీసుకుంటాయి” అని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News