హైదరాబాద్ - విజయవాడ మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పండుగలు, వీకెండ్ సెలవులు, భారీ వర్షాలు వల్ల నగరవాసులు సొంతూర్లకు వెళ్లి తిరిగి నగరానికి చేరుకుంటుండటంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాల రద్దీ పెరిగింది. ఉదయం నుంచి అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. సొంతూళ్లకుకు వెళ్లి తిరిగి నగరానికి వచ్చే వాహనాలతో ఒక్కసారిగా రద్దీ ఏర్పడింది.
టోల్ ప్లాజాల వద్ద...
దీంతో టోల్ ప్లాజాలవద్ద మాత్రమే కాకుండా పలు చోట్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. వేలాది వాహనాలు ఒక్కసారిగా రావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. అదనంగా నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం కూడా ట్రాఫిక్ జామ్‌కి కారణమని చెబుతున్నారు. పెద్దకాపర్తి నుంచి చిట్యాల వరకు వాహనాలు గంటల తరబడి నిలిచిపోగా, పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు.