Hyderabad : హైదరాబాద్‌లో ఓన్లీ ఇడ్లీ...ఉప్మా.. నో దోశ, పూరి, వడ

ఎల్.పి.జి గ్యాస్ కొరతతో హోటల్ రంగం సంక్షోభంలో పడింది

Update: 2026-03-11 11:46 GMT

ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా ఎల్.పి.జి గ్యాస్ కొరతతో హోటల్ రంగం సంక్షోభంలో పడింది. దీంతో తాత్కాలికంగా హోటళ్లు, హాస్టళ్లు, మెస్‌లు మూసివేసే పరిస్థితికి చేరుకున్నారు. గ్యాస్ ను ఆదా చేయడమే కాకుండా మెనూలో మార్పులు చేసి కొందరు హోటల్స్ ను నడుపుతున్నారు. మెనూను కుదించి, ధరలు పెంచిన మరికొన్ని హోటళ్లు నడుపుతున్నాయి.

పీజీల్లో మెనూ కుదింపు...
వండేందుకు ఎక్కువ నూనె తీసుకునే, ఎక్కువ సమయం తీసుకునే టీ, కాఫీ, చపాతీ, దోశ, పూరిలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్ ఐటీ కారిడార్ హోటళ్ల అసోసియేషన్ ప్రకటించింది. ఎక్కువ సేపు వండే వంటలను తగ్గించి అన్నం, సాంబార్, పప్పు, రసంలనే వడ్డిస్తున్న హైదరాబాద్‌లోని పీజీ హాస్టళ్లు, మెస్‌లు వడ్డిస్తున్నాయి. రెండు, మూడు రోజులైతే వీటిని పూర్తిగా నిలిపివేసి, హాస్టళ్లను తాత్కాలికంగా మూసివేయడం తప్పదని నిర్వాహకులు అంటున్నారు.రవాణా ఛార్జీలు పెరగడంతో దోశ, పూరి, వడలపై కనీసం రూపాయలు, ఇడ్లీ, ఉప్మా లాంటి వాటిపై కనీసం పది రూపాయల వరకు పెద్ద హోటళ్లు పెంచాయి.


Tags:    

Similar News