Hyderabad : హైదరాబాద్ లో రెండు గంటల నుంచి భారీ వర్షం.. ఇబ్బందులపడుతున్న నగరవాసులు

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తుంది. దీంతో ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి

Update: 2025-07-18 11:59 GMT

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తుంది. దీంతో ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. అనేక చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి ఏకధాటిగా భారీ వర్షం కురుస్తూనే ఉంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్‌, కంటోన్మెంట్‌, హకీంపేట్, మియాపూర్, కూకట్ పల్లి, ప్రగతినగర్, మూసాపేట్, అమీర్ పేట్, బేగంపేట్, నాంపల్లి, ఖైరతాబాద్, కోఠి, చాదర్ ఘాట్, మలక్పేట్, దిల్ సుఖ్ నగర్, సరూర్ నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది.

ట్రాఫిక్ ఇబ్బందులు...
అబ్దుల్లాపేర్ మెట్, సికింద్రాబాద్, అల్వాల్, తిరుమలగిరి, బోయినపల్లి, మారేడ్ పల్లి, తార్నాక, ఓయూ క్యాంపస్, హబ్సిగూడ, ఉప్పల్, నాచారం, మల్లాపూర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్, గాంధీనగర్, కవాడిగూడ, భోలక్ పూర్, చిక్కడపల్లి, హిమాయత్ నగర్ లలో వర్షం పడుతుంది. ఒక్కసారిగా కురిసిన భారీవర్షంతో రహదారులన్నీ జలమయం కావడంతో వాహనాలు నీటిలో మొరాయించాయి. వాతావరణ శాఖ హైదరాబాద్ కు భారీ వర్షం పడుతుందని చేసిన హెచ్చరికలతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు.
అవసరమైతే తప్ప...
అనేక చోట్ల ట్రాఫిక్ గంటల పాటు నిలిచిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో మ్యాన్ హోళ్లు తెరుచుకోవడంతో ప్రమాదకరంగా మారింది. ఈరోజు రాత్రి వరకూ భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో నగర వాసులు ఎవరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు. ఆఫీసు నుంచి ఇళ్లకు చేరే వారు కూడా మెట్రో రైళ్ల ద్వారానే చేరుకోవాలని సూచించారు. వర్షపు నీరు తగ్గిన తర్వాత మాత్రమే ఆఫీసు నుంచి బయటకు రావాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాజేంద్రనగర్‌, చేవేళ్లలో భారీ వర్షం. ఇబ్రహీంపట్నంలో ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతును్నారు.




Tags:    

Similar News