Hyderbad : ఉక్కపోత నుంచి ఉపశమనం.. అకాల వర్షంతో అవస్థలు అయినా?

హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. అనేక ప్రాంతాల్లో భారీ వర్షంతో రహదారులు జలమయమయ్యాయి.

Update: 2025-09-10 12:25 GMT

హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. అనేక ప్రాంతాల్లో భారీ వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. ఉదయం నుంచి ఎండతీవ్రతతో అల్లాడిన ప్రజలు ఒక్కసారిగా కురిసిన వర్షంతో ఒకింత హ్యాపీ ఫీలవుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి హైదరాబాద్ లో ఉక్కపోత వాతావరణం ఉంది. ఆపేసిన ఏసీలను తిరిగి వేసుకునే పరిస్థితికి వచ్చింది. తెల్లవారు జామున మాత్రం కొంత చలివాతావరణం ఉంటుంది. పగలంతా ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో నగరవాసులకు వాతావరణం ఇబ్బందికరంగా మారింది. అయితే ఈరోజు ఉన్నట్లుండి మధ్యాహ్నం నుంచి వాతావరణం మారిపోయింది.

మధ్యాహ్నం దంచికొట్టిన ఎండ...
అప్పటి వరకూ ఎండతీవ్రత ఎక్కువగా ఉండటంతో బయటకు వచ్చేందుకు కూడా ప్రజలు భయపడిపోయారు. అయితే మధ్యాహ్నం నాలుగు గంటలకు ప్రారంభమైన వర్షం భారీ కురిసింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్ పల్లి, కొండాపూర్, మొహిదీపట్నం, లక్డీకా పూల్, అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్, ఉప్పల్, నాగోల్, సరూర్ నగర్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురియడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
ట్రాఫిక్ సమస్యలు...
రహదారులపైకి నీరు చేరడంతో ఐకియా సర్కిల్ తో పాటు మొహిదీపట్నం, మాదాపూర్, జూబ్లీహిల్స్, మలక్ పేట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. రహదారులపై నీరు నిలిచిపోవడంతో కొన్నివాహనాలు రోడ్లపైనే మొరాయిస్తున్నాయి.అయితే తాజాగా వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రానున్న నాలుగు రోజుల పాటు ఉరుమలతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. క్యుములో నింబస్ మేఘాల కారణంగా కొన్నిచోట్ల కుండపోత వర్షాలు కురిశాయని వాతావరణ శాక అధికారులు తెలిపారు. ఈ నెలలో అధిక వర్షపాతంతో పాటు అధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
Tags:    

Similar News