హైదరాబాద్ లో భారీ వర్షం.. తప్పని ట్రాఫిక్ కష్టాలు

పంజాగుట్ట, ఖైరతాబాద్ విద్యుత్ సౌధ, కెసిపి, సిఈవో, నిమ్స్ నుండి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. శ్రీనగర్ కాలనీ..

Update: 2023-07-24 13:39 GMT

హైదరాబాద్ నగరంలో చిన్న వర్షానికి భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోవడం షరా మామూలైపోయింది. జీహెచ్ఎంసీ ఎంత చొరవ తీసుకున్నా.. వర్షాల సమయంలో మాత్రం ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. అసలే ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం.. ఈ సమయంలో వర్షం కురిస్తే.. ఇక అంతే సంగతులు. త్వరగా ఇల్లు చేరుకోవాలన్న మాట మరిచిపోవాల్సిందే. మరోసారి సోమవారం సాయంత్రం భారీ వర్షం కురవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. పంజాగుట్ట, ఖైరతాబాద్ విద్యుత్ సౌధ, కెసిపి, సిఈవో, నిమ్స్ నుండి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. శ్రీనగర్ కాలనీ సుల్తాన్ ఉలూమ్ కళాశాల, చట్నీస్, ఎన్ ఎఫ్ సి ఎల్ నుండి పంజాగుట్ట వైపు వాహనాల రాకపోకలు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు పంజాగుట్ట పోలీసులు రంగంలోకి దిగారు. భారీ వర్షం కురుస్తుండటంతో ట్రాఫిక్ జామ్ అవుతుందని, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ అన్నోజిగూడ పోచారం నారపల్లి బోడుప్పల్ పీర్జాదిగూడ, నిజాంపేట, బాచుపల్లి ప్రగతినగర్, కూకట్ పల్లి, JNTU, ముసపెట్, జగద్గిరిగుట్ట, కొండాపూర్, గచ్చిబౌలి, మియాపూర్ , మెహిదీపట్నం, కార్వాన్, గుడిమల్కాపూర్, మాసబ్ ట్యాంక్, టోలిచౌకి, నాంపల్లిలోని బషీర్ బాగ్, అబిడ్స్, కోటి, సుల్తాన్ బజార్, బేగంబజార్, అంబర్ పేట్ తదితర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉప్పల్ లోని తార్నాక, నాచారం, కుత్బుల్లాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, చందానగర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లోనూ భారీ వర్షానికి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అటు సికింద్రాబాద్, బేగంపేట్ మారేడ్పల్లి, అడ్డగుట్ట, ప్యాట్నీ, బోయిన్ పల్లి, ప్యారడైజ్, చిలకలగూడా, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ తదితర ప్రాంతాలు భారీ వర్షానికి తడిసి ముద్దవుతున్నాయి. రేపు, ఎల్లుండి తెలంగాణలో అతిభారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చరించింది.


Tags:    

Similar News