Hyderabad : అగ్నిప్రమాద బాధితులకు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్ లోని చార్మినార్ గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియో ప్రకటించింది

Update: 2025-05-18 11:41 GMT

హైదరాబాద్ లోని చార్మినార్ గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియో ప్రకటించింది. ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉప మ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మృతులకు కుటుంబాలకు ఒక్కొక్కరికి ఈ పరిహారం అందిస్తామని తెలిపింది.

అగ్నిప్రమాదానికి గల కారణాలను...
చార్మినార్ గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇప్పటి వరకూ పదిహేడు మంది మరణించారు. దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ లతో కలసి మల్లు భట్టి విక్రమార్క సంఘటన స్థలిని పరిశీలించారు. ప్రమాదానికి గలకారణాలను అడిగి తెలుసుకున్నారు. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటన స్థలికి వచ్చారని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను అగ్నిమాపక సిబ్బంది ఇంకా అధికారరింగా ప్రకటించలేదు. కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలను ప్రకటించింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.


Tags:    

Similar News