మళ్లీ షాకిచ్చిన బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరలు నేడు మళ్లీ పెరిగాయి.
బంగారం, వెండి ధరలు నేడు మళ్లీ పెరిగాయి. వారం రోజుల నుంచి ఈరోజు ఉదయం వరకూ తగ్గిన బంగారం, వెండి ధరలు మళ్లీ ధరలు పెరిగాయి. గత కొద్ది రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతుండటంతో మరింత తగ్గుతాయని అనేక మంది కొనుగోలు చేయడం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ మళ్లీ ధరలు భారీగా పెరగడంతో ఈ ధరల పెరుగుదల ఆగేట్లు లేదని అనిపిస్తుంది. ధరల తగ్గుదల తాత్కాలికమేనని మరోసారి రుజువయింది.
భారీగా పెరగడంతో...
ఈరోజు పది గ్రాముల బంగారం ధరపై రెండు వేల రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,57,540 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి ధరపై పదకొండు వేల రూపాయలు పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర 2,61,745 రూపాయలకు చేరుకుంది.