Gold Prices : పసిడి ప్రియులకు భారీ షాక్

బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల కనిపించింది

Update: 2026-02-07 05:52 GMT

పసిడిప్రియులకు మరోసారి షాక్ తగిలింది. బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల కనిపించింది. నిన్నటి వరకూ కొంత తగ్గినట్లు కనిపించినప్పటికీ ఈరోజు మాత్రం బంగారం, వెండి ధరలు భారీగా పెరగడంతో పెళ్లిళ్ల సీజన్ లో కొనుగోలు చేయడంపై వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలుపై డైలమాలో పడ్డారు.

నేటి ధరలు ఇలా...
పది గ్రాముల బంగారం ధర పై ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 2,890 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధర పది వేల రూపాయలు పెరిగింది. దీనివల్ల కొనుగోలుదారులు మళ్లీ బంగారం అంటేనే భయపడిపోతున్నారు. ప్రస్తుతం 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,43,550 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,56,600 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 2,85,000 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.


Tags:    

Similar News