Hyderabad : న్యాయస్థానాలకు బాంబు బెదిరింపు
హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది.
హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. న్యాయవాదులను, న్యాయమూర్తులను, కోర్టు సిబ్బందిని బయటకు పంపి తనిఖీలను నిర్వహిస్తున్నారు. అలాగే విశాఖపట్నం కోర్టుకు కూడా ఇలాగే బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.
పోలీసుల తనిఖీలు...
బాంబ్ స్క్కాడ్, డాగ్ స్క్వాడ్ లతో తనిఖీలను నిర్వహిస్తున్నారు. న్యాయస్థానాల ప్రాంగణాన్ని ఖాళీ చేయిచి అన్ని గదులను పరిశీలిస్తున్నారు. అయితే ఎలాంటి బాంబు కనిపించకపోవడంతో ఇది ఆకతాయిల పనిగా పోలీసులు భావిస్తున్నారు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ాఆ దిశగా విచారణ చేపడుతున్నారు.