Hyderabad : 13 కిలోమీటర్లు.. పదమూడు నిమిషాలు.. మెట్రోలో గుండె తరలింపు
హైదరాబాద్ మెట్రో రైలులో గుండెను డాక్టర్లు తరలించారు. ఎల్బీ నగర్ నుంచి లక్షీకాపూల్ మెట్రో రైల్లో వైద్యులు తరలించారు
metro trains in hyderabad
హైదరాబాద్ మెట్రో రైలులో గుండెను డాక్టర్లు తరలించారు. ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రి నుంచి లక్షీకాపూల్ గ్లోబల్ ఆసుపత్రికి మెట్రో రైల్లో గుండెను వైద్యులు తరలించారు. ఇందుకోసం మెట్రో అధికారులు ప్రత్యేకంగా గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసిన మెట్రో అధికారులు వైద్యులు సకాలంలో ఆసుపత్రికి చేరుకునేలా అన్ని రకాల సహకరించారు.
గ్రీన్ కారిడార్ ను...
లక్డీకాపూల్ గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒకరోగికి గుండెను అమర్చాల్సి వచ్చింది. ఇందుకు ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రి నుంచి గుండెను ప్రత్యేకంగా తీసుకు రావాల్సి ఉంది. అయితే రోడ్డు మార్గాన వస్తే ఎక్కువ సమయం పడుతుందని భావించిన వైద్యులు మెట్రో సంస్థను సహకారాన్ని కోరారు. దీంతో కేవలం పదమూడు కిలోమీటర్ల దూరాన్ని పదమూడు నిమిషాల్లో చేరుకుని రోగికి వైద్యులు గుండెను అమర్చగలిగారు.