Breaking : హైదరాబాద్ కరాచీ బేకరీలో సిలిండర్ పేలుడు... ఆరుగురి పరిస్థితి విషమం
హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లోని కరాచీ బేకరీలో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో పదిహేను మందికి తీవ్ర గాయాలయ్యాయి
karachi bakery cylinder exploded
హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లోని కరాచీ బేకరీలో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో పదిహేను మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. కరాచీ బేకరీలో సిలండర్ పేలిన ఘటన కలకలం సృష్టించింది. గాయపడిన వారిలో సిబ్బంది తో పాటు కొందరు కస్టమర్లు కూడా ఉన్నట్లు తెలిసింది.
గాయపడిన వారిని...
ఘటన విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి పంపి చికిత్స అందిస్తున్నారు. సిలిండర్ ఎందుకు పేలిందన్న దానిపై విచారణ జరుగుతుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.