శంషాబాద్ లో మొసలి కనిపించి ప్రజలను టెన్షన్ పెట్టింది. సిద్ధుల గుట్ట సిద్ధమేశ్వర స్వామి ఆలయం వద్ద వాగులో భక్తులకు మొసలి కనిపించింది. కార్తీక మాసం సందర్భంగా భక్తులు అక్కడకు తరలిరాగా మొసలి కనిపించడంతో ఆందోళన చెందారు. నీటిలోకి దిగాలంటే చాలు భయపడుతున్నారు. వీలైనంత త్వరగా మొసలిని బంధించి జూపార్కుకు తరలించారని అటవీశాఖ అధికారులకు భక్తులు విజ్ఞప్తి చేశారు.