కూకట్ పల్లి బాలిక హత్య కేసులో కీలక అప్ డేట్

కూకట్ పల్లి బాలిక హత్య కేసులో నిందితుడైన బాలుడిని న్యాయస్థానం కస్టడీకి అనుమతించింది.

Update: 2025-09-10 06:57 GMT

కూకట్ పల్లి బాలిక హత్య కేసులో నిందితుడైన బాలుడిని న్యాయస్థానం కస్టడీకి అనుమతించింది. రెండు రోజుల పాటు పోలీసులు బాలుడిని ప్రశ్నించారు. మైనర్ కావడంతో బాలుడిని జువైనల్ హోంలోనే పోలీసులు ప్రశ్నించారు. అయితే ఈ రెండు రోజుల్లోనూ పోలీసులు హత్యకు గల కారణాలను గురించి బాలుడిని పదే పదే అడిగారు.

బ్యాట్ కోసమేనంటూ...
అయినా బాలుడు మాత్రం తాను క్రికెట్ బ్యాట్ కోసమే హత్య చేశానని, అంతకు మించి వేరే కారణాలు లేవని పోలీసులకు చెప్పారు. సైకియాట్రిస్ట్ తో కూడా బాలుడికి పరీక్షలు నిర్వహించారు. బాలుడిపై హత్యతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రసిటీ కేసు నమోదు చేయడంతో బాలుడిని జువైనల్ హోమ్ లోనే ఉంచి ప్రశ్నించారు. అయితే హత్య చేసిన నాటికి, నేటికి బాలుడి లో మార్పు కనిపిస్తుందని పోలీసులు తెలిపారు.


Tags:    

Similar News