బీజేపీ చూసే విధానం వేరు : రాహుల్

బీజేపీ చూసే విధానం వేరుగా ఉంటుందని, కాంగ్రెస్ అనుసరించే పద్ధతి మరోలా ఉంటుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.

Update: 2025-04-26 12:10 GMT

బీజేపీ చూసే విధానం వేరుగా ఉంటుందని, కాంగ్రెస్ అనుసరించే పద్ధతి మరోలా ఉంటుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో జరిగిన భారత్ సమ్మిట్ లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ గత పదేళ్ల నుంచి ప్రపంచ రాజకీయాలు మారిపోయాయని తెలిపారు. ఆధునికతతో పాటు సామాజిక మాధ్యమాలతో ఒక్కసారిగా రూపు రేఖలే మారిపోయాయయని చంద్రబాబు అన్నారు. భారత్ అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందని, కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని ఆయన యువతకు పిలుపు నిచ్చారు.

కొత్త తరం నాయకత్వం...
కొత్త తరం నాయకత్వం రాజకీయాల్లోకి రావాలని రాహుల్ గాంధీ పిలుపు నిచ్చారు. తాను ఎన్నికలకు ముందు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశానని, పాదయాత్ర ద్వారా దేశంలో జరుగుతున్న అనేక పరిస్థితులను తెలుసుకున్నానని తెలిపారు. తాను వేసిన తొలి అడుగు తర్వాత వెనుదిరగలేదని, తర్వాత తన వెనక చాలామంది కలసి నడిచారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. దేశం సమైక్యంగా ఉన్నప్పుటే అభివృద్ధి సాధ్యమవుతుందని రాహుల్ గాంధీ ఆకాంక్షించారు.


Tags:    

Similar News