నేడు కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం

నేడు హైదరాబాద్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు

Update: 2022-08-04 02:24 GMT

నేడు హైదరాబాద్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. పోలీసు పనితీరు మరింత మెరుగుపడేందుకు ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉపయోగపడుతుంది. మొత్తం ఐదు టవర్లలో ఈ సెంటర్ ను నిర్మించారు. 2016లో దీనికి శంకుస్థాపన జరిగింది. ఆరేళ్లలో దీనిని పూర్తి చేశారు. దాదాపు 600 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ముంబయి కి చెందిన షాపూర్ జీ పల్లోంజీ సంస్థ నిర్మించింది. ఇక్కడి నుంచే మొత్తం పోలీసు వ్యవస్థ పనిచేసేలా దీనిని నిర్మాణం చేశారు.

ఎక్కడ ఏం జరిగినా....
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలను అనుసరించి దీనిని నిర్మాణం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే తెలుసుకునేలా దీనిని రూపొందించారు. ఒకేసారి లక్ష సీసీ కెమెరాలను చూసేందుకు అనువుగా ఇందులో ఏర్పాట్లు చేశారు. శాంతిభద్రతలను పర్యవేక్షించడానికి ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇక్కడే డీజీపీ నుంచి అన్ని పోలీసు కార్యాలయాలు ఉంటాయి. మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ సెంటర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇది హైదరాబాద్ కు మరో మణిహారం అని చెప్పకతప్పదు.


Tags:    

Similar News