‌Hyderabad : అదిగదిగో చిరుత.. కనిపించినట్లే కనిపించి.. అలా వెళ్లిందే

శంషాబాద్ ఎయిర్ పోర్టులో చిరుత కోసం వేట కొనసాగుతుంది

Update: 2024-04-29 06:53 GMT

శంషాబాద్ ఎయిర్ పోర్టులో చిరుత కోసం వేట కొనసాగుతుంది. అయితే చిరుత జాడ కనిపించినా అది మాత్రం బోనులో చిక్కలేదు. గత రెండు రోజుల నుంచి అటవీ శాఖ అధికారులు చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ట్రాప్ కెమెరాలు పెట్టారు. డ్రోన్ల ద్వారా చిరుత జాడ కోసం వెదుకుతున్నారు. కానీ చిరుత మాత్రం కనిపించడం లేదు. బోన్లను కూడా ఏర్పాటు చేశారు. ఎయిర్ పోర్టు ఫెన్సింగ్ దూకడంతో ఎయిర్‌పోర్టులోని అలారం మోగడంతో అప్రమత్తమయిన అధికారులు చిరుత రావడాన్ని గమనించారు. ట్రాప్ కెమెరాలో చిరుతను గుర్తించిన అధికారులు దానిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఏడడుగుల ఎత్తున్న...
ఏడడుగుల ఎత్తు ఉన్న ఎయిర్ పోర్టు ఫెన్సింగ్ ను దూకి రన్ వే పైకి వచ్చిందని చెబుతున్నారు. రెండు రోజుల క్రితం చిరుత రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్ వేపై చిరుత తిరుగుతుండటాన్ని గమనించిన సిబ్బంది అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు తొమ్మిది ట్రాప్ కెమెరాలు ఉంచారు. డ్రోన్ కెమెరాలతో వెదుకుతున్నారు. చిరుత ఈ సమీపంలోనే ఉండవచ్చన్న అంచనాలో అధికారులున్నారు. చిరుత బోను వద్దకు వచ్చినట్లే వచ్చి వెళ్లిపోయింది. బోనులో ఒక మేకను కూడా ఉంచారు.


Tags:    

Similar News