Hyderabad : పాతబస్తీ మృతులకు మోదీ ఎక్స్ గ్రేషియో

హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతులకు కేంద్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియో ప్రకటించింది

Update: 2025-05-18 06:22 GMT

హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతులకు కేంద్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియో ప్రకటించింది. ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు. పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలను మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి యాభై వేల రూపాయల సాయాన్ని ప్రకటించారు.

గాయపడిన వారికి...
గాయపడిన వారికి మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని కోరారు. వారి చికిత్సకు అయ్యే ఖర్చు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలన్నారు. పాతబస్తీలో జరిగిన ఘటన విషాదమన్న మోదీ మృతుల కుటుంబాలు ఈ ఘటన నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు తక్షణమే కేంద్ర ప్రభుత్వం సాయం ప్రకటించిందని తెలిపారు.


Tags:    

Similar News