Hyderabad : హైదరాబాద్ లో యాపిల్ స్టోర్.. ఉద్యోగాలకు నోటిఫికేషన్

హైదరాబాద్ లో కొత్తగా యాపిల్ స్టోర్ ను ఏర్పాటు చేసే యోచనలో ఉంది

Update: 2026-02-06 02:22 GMT

హైదరాబాద్ లో కొత్తగా యాపిల్ స్టోర్ ను ఏర్పాటు చేసే యోచనలో ఉంది. ఐఫోన్ సంస్థ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దేశంలో వరసగా రిటైల్ కేంద్రాలను యాపిల్ సంస్థ ఇప్పటికే ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, పూణె, నోయిడాలో తమ రిటైల్ కేంద్రాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా అత్యధికంగా యాపిల్ వస్తువులు అమ్ముడుపోయే నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా ఆ సంస్థ గుర్తించింది. దీంతో హైదరాబాద్ లో ఒక రిటైల్ కేంద్రాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది.

కెరీర్ పోర్టల్ లో...
ఇందుకోసం ఉద్యోగాలకు కూడా దరఖాస్తులను ఆహ్వానించింది. యాపిల్ తన కెరీర్ పోర్టల్ లో తమ రిటైల్ కేంద్రంలో కావాల్సిన ఉద్యోగాలకు అర్హులైనవారు అప్లయ్ చేసుకునేందుకు వీలు కల్పించింది. ఇందులో సీనియర్ మేనేజర్, రిటైల్ మేనేజర్, టెక్నికల్ స్పెషలిస్ట్, బిజినెస్ ఎక్స్ పర్ట్స్, ఆపరేషన్ ఎక్స్ పర్ట్స్, అవుట్ లెట్ మేనేజర్, స్టోర్ లీడర్ వంటి పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో పూర్తి కాలంతో పాటు పార్ట్ టైమ్, కాంట్రాక్ట్ ఎక్స్ పర్ట్స్, మేనేజర్స్ వంటి పోస్టులున్నాయి. దీంతో యాపిల్ సంస్థలో పనిచేయాలనుకుంటున్న వారికి హైదరాబాద్ నగరంలోనే పనిచేసే అవకాశం లభించినట్లవుతుంది.


Tags:    

Similar News