హైదరాబాద్ లో మరో ఐకానిక్ బ్రిడ్జి సిద్ధం

హైదరాబాద్‌లోని మీరాలం చెరువుపై 430 కోట్ల రూపాయలతో సరికొత్త ఐకానిక్ బ్రిడ్జిని నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

Update: 2025-07-25 09:15 GMT

హైదరాబాద్‌లోని మీరాలం చెరువుపై 430 కోట్ల రూపాయలతో సరికొత్త ఐకానిక్ బ్రిడ్జిని నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 2.5 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన చింతల్‌మెట్ నుండి శాస్త్రిపురం వరకు విస్తరించనుంది. ఇది పర్యాటకంగానూ కీలకంగా మారనుంది. మూసీ నది అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు రాష్ట్ర పురపాలకశాఖ అనుమతి మంజూరు చేసింది. బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, టెండరు ప్రక్రియను ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభించనున్నారు.

ఐకానిక్ బ్రిడ్జి పొడవు 2.5 కి.మీ ఉండనుంగా, వెడల్పు 16.5 మీటర్లు ఉండనుంది. ఈ బ్రిడ్జిని చెరువుకు పశ్చిమాన ఉన్న చింతల్‌మెట్, తూర్పున శాస్త్రిపురం నుంచి సాగిపోయే బెంగళూరు నేషనల్ హైవేను కలిపేలా నిర్మించనున్నారు. చెరువు మధ్యలో మూడు దీవులుంటాయి. చెరువు నిర్మించినప్పుడు దీని విస్తీర్ణం 600 ఎకరాలు కాగా ప్రస్తుతం అది 450ఎకరాలకు పరిమితమైంది

Tags:    

Similar News