Hyderabad : విమానం అత్యవసర ల్యాండింగ్...ఎందుకంటే?

మధురై నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

Update: 2025-10-11 05:16 GMT

మధురై నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. 76 మంది ప్రయాణికులతో వస్తున్న ఒక ప్రైవేట్‌ ఎయిర్‌లైన్‌ విమానంలో విండ్ షీల్డ్ పగలడంతో ఆందోళన నెలకొంది. శనివారం ల్యాండింగ్‌కు ముందే పైలట్‌ విండ్ షీల్డ్ లో పగుళ్లను గుర్తించి విమానాశ్రయంలోని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌కు సమాచారం అందించాడు. తక్షణమే విమానాశ్రయంలో అవసరమైన ఏర్పాట్లు చేసి, విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయ్యేలా చర్యలు తీసుకున్నారు.

విండ్ షీల్డ్ లో పగుళ్లతో...
అనంతరం ఆ విమానాన్ని ప్రత్యేక బే లో నిలిపారు. ప్రయాణికులను సురక్షితంగా దింపారు. విండ్ షీల్డ్ం మార్పు కోసం ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తున్నారు. సంఘటనకు గల కారణం ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటన కారణంగా మదురై వెనక్కి వెళ్లాల్సిన రిటర్న్‌ ఫ్లైట్‌ను రద్దు చేసినట్లు చెప్పారు. మధురై నుంచి వచ్చిన ప్రయివేటు విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది.


Similar News