400 సంవత్సరాల చరిత్ర ఉన్న బావోబ్యాబ్ చెట్టు.. కూలిపోయిందే!!
హైదరాబాద్ సమీపంలోని చింగిచెర్ల అడవిలో 400 సంవత్సరాల పురాతనమైన బావోబ్యాబ్ చెట్టు తెగుళ్ల బెడద కారణంగా కూలిపోయింది.
హైదరాబాద్ సమీపంలోని చింగిచెర్ల అడవిలో 400 సంవత్సరాల పురాతనమైన బావోబ్యాబ్ చెట్టు తెగుళ్ల బెడద కారణంగా కూలిపోయింది. ఇది పర్యావరణవేత్తలలో ఆందోళనను కలిగిస్తోంది. ఈ పురాతన చెట్లలో ఇప్పుడు మూడు బావోబ్యాబ్ చెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి, వీటిని నాలుగు శతాబ్దాల క్రితం ఆఫ్రికన్ స్థిరనివాసులు నాటినట్లు భావిస్తున్నారు. మొత్తం దక్కన్ ప్రాంతంలో ఇప్పుడు 20 కంటే తక్కువ బావోబ్యాబ్ చెట్లు మనుగడ సాగిస్తున్నాయి. బావోబ్యాబ్ చెట్లు అడన్‌సోనియా జాతికి చెందిన వృక్షాలు. ఆఫ్రికా, అరేబియా, ఆస్ట్రేలియా, మడగాస్కర్‌లో ఎక్కువగా కనిపిస్తుంటాయి.ప్రపంచవ్యాప్తంగా 8 జాతుల బావోబ్యాబ్ వృక్షాలు కనిపిస్తుంటాయి. ఒక జాతి వృక్షాలు ఆఫ్రికాలో కనిపిస్తే ఆరు జాతులు మడగాస్కర్‌లో విస్తరించి ఉన్నాయి. మరొక జాతి వృక్షాలేమో సుదూర ఆస్ట్రేలియాలో పెరుగుతుంటాయి.