హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి ట్రాఫిక్ర జాం
హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు భారీ సంఖ్యలో చేరాయి
హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు భారీ సంఖ్యలో చేరాయి. దీంతో ఈ రూట్ం లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. వరుస సెలవులు రావడంతో సొంతూళ్లకు తమ వాహనాలలో బయలుదేరడంతో ఒక్కసారి హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిలో పెద్ద సంఖ్యలో వాహనాలు చేరుకున్నయి.
వరస సెలవులు రావడంతో...
విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడటంతో వాహనదారుల ఇబ్బందులు పడుతున్నారరు. ఓఆర్ఆర్ నుంచి విజయవాడ హైవేపై నెమ్మదిగా వాహనాలు కదులుతున్నాయి. రోడ్డు విస్తరణతో కొన్ని చోట్ల వాహనదారుల ఇబ్బందులు పడుతున్నారు. టోల్ గేట్ల వద్ద కూడా ఎక్కువ సేపు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.