నెంబర్ ప్లేటు మారుస్తూ.. ట్రాఫిక్ పోలీసులను ఏమారుస్తూ...
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ఓ వ్యక్తి షాక్ ఇచ్చాడు
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ఓ వ్యక్తి షాక్ ఇచ్చాడు. ట్రాఫిక్ చలనాలు తప్పించుకునేందుకు సరికొత్త ఎత్తులు సృష్టించాడు. జూబ్లీహిల్స్ లో మద్యం సేవించిన వ్యక్తి పోలీసులకు చిక్కడంతో ఈ విషయం బయటపడింది. కారులో నెంబర్ ప్లేటు మార్చే ప్రత్యేక సిస్టమ్ ను ఆ వ్యక్తి ఏర్పాటు చేసుకోవడం విశేషం.
నెంబరు ప్లేట్ మారుతుండటాన్ని ...
నెంబరు ప్లేట్ మారుతుండటాన్ని చూసి ట్రాఫిక్ పోలీసులు షాక్ కు గురయ్యారు. వేర్వేరు ప్లేట్ లతో పోలీసులను బురిడి కొట్టించే యత్నం చేశారు. మద్యం మత్తులో వాహనదారుడు పోలీసులకు చిక్కడంతో వెంటనే అతనిపై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.