కేకే కుమారుడికి బెదిరింపులు
మాజీ రాజ్యసభ్యుడు కే కేశవరావు కుమారుడుకు బెదిరింపులు వచ్చాయి
మాజీ రాజ్యసభ్యుడు కే కేశవరావు కుమారుడుకు బెదిరింపులు వచ్చాయి. ఇంటి క్రమబద్ధీకరణ అంశంలో పిటిషన్ వేసి బ్లాక్‌మెయిల్ కు కొందరు దిగారని ఆయన పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమకు మూడు కోట్ల రూపాయలు ఇస్తే కేసు విత్‌డ్రా చేసుకుంటామని ప్రతిపాదన చేసినట్లు కేకే కుమారుడు వెంకట్ తెలిపారు. అంగీకరించకపోతే మరిన్ని కేసులు వేస్తామని బెదిరించారు.
పోలీసులకు ఫిర్యాదు...
అయితే ఈ బెదిరింపులపై కేకే కుమారుడు వెంకట్ బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అయితే బెదిరించిన వారు సిద్దిపేట వాసులు రఘువీరారెడ్డి, అన్వేష్‌రెడ్డిగా గుర్తించిన పోలీసుల వారిపై కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ల్యాండ్ విషయంలోనే వారు కేకే కుమారుడు వెంకట్ ను బెదరించారని పోలీసులు తెలిపారు.