Hyderabad : హైదరాబాద్‌లో పెరిగిన వాయుకాలుష్యం
హైదరాబాద్ నగరంలో సోమవారం జరుపుకున్న దీపావళి వేడుకలతో గాలి, శబ్ద కాలుష్యం పెరిగింది
హైదరాబాద్ నగరంలో సోమవారం జరుపుకున్న దీపావళి వేడుకలతో గాలి, శబ్ద కాలుష్యం పెరిగింది. శబ్ద, వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిందని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తెలిపారు. దీపావళి తర్వాత గణనీయంగా శబ్ద, వాయు కాలుష్యం పెరిగిందని చెప్పింది. అక్టోబర్ 13 నుంచి 20 వరకు నిర్వహించిన ప్రత్యేక పర్యవేక్షణలో దీపావళి రోజు గాలిలోని సూక్ష్మ కణాల మోతాదులు సాధారణ దినంతో పోలిస్తే ఎక్కువగా నమోదయ్యాయని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తెలిపారు.
దీపావళి టపాసులతో...
సోమవారం పీఎం 2.5 స్థాయి 86 శాతం పెరిగినట్లు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు గుర్తించారు. గత ఏడాది దీపావళి సందర్భంగా ఇది 91 శాతం పెరిగింది. పీఎం 10 స్థాయి ఈసారి 68.13 శాతం పెరగగా, గత ఏడాది 65.76 శాతం పెరిగింది. న్యూ మలక్ పేట్ లో ఎక్కువగా వాయు కాలుష్యం ఉందని అధికారులు తెలిపారు. శబ్దకాలుష్యం కూడా విపరీతంగా పెరిగిందని చెప్పారు. హైదరాబాద్ లో సాధారణంగా వాహనాల రాకపోకల వల్ల వాయు కాలుష్యం పెరుగుతుంది. ఇప్పుడు దీపావళి పండగ తర్వాత హైదరాబాద్ లో వాయు కాలుష్యం పెరగడంతో నగర వాసులు ఆందోళన చెందుతున్నారు.