నిజ నిర్ధారణ: మహ్సా అమిని అంత్యక్రియల్లో ఆమె తండ్రి చేసిన డ్యాన్స్ అంటూ వైరల్ అవుతున్న వీడియో నిజం కాదు

హిజాబ్ నిబంధనలపై ఇరాన్ నైతిక పోలీసుల కస్టడీలో 22 ఏళ్ల మహ్సా అమినీ మరణించిన తర్వాత పెద్ద సంఖ్యలో నిరసనలు చెలరేగాయి. ఆమెను కుర్దిస్థాన్ ప్రావిన్స్‌లోని ఆమె స్వస్థలమైన సక్వెజ్‌లో ఖననం చేశారు.

Update: 2022-10-06 06:28 GMT

హిజాబ్ నిబంధనలపై ఇరాన్ నైతిక పోలీసుల కస్టడీలో 22 ఏళ్ల మహ్సా అమినీ మరణించిన తర్వాత పెద్ద సంఖ్యలో నిరసనలు చెలరేగాయి. ఆమెను కుర్దిస్థాన్ ప్రావిన్స్‌లోని ఆమె స్వస్థలమైన సక్వెజ్‌లో ఖననం చేశారు.

ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో వేలాది మంది కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు చేపట్టారు. రాళ్లదాడికి పాల్పడుతున్న పెద్ద సంఖ్యలో నిరసనకారులను చెదరగొట్టేందుకు ఇరాక్ భద్రతా దళాలు బాష్పవాయువులు, స్టన్ గ్రెనేడ్లను ప్రయోగించాయి.

దీని మధ్య, ఒక వ్యక్తి శవపేటిక ముందు డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అయ్యింది, "నా జీవితంలో నేను ఎప్పుడూ చూడని విషాదకరమైన విషయం: తన కుమార్తెకు పెళ్లిలో డ్యాన్స్ చేస్తానని వాగ్దానం చేసిన తండ్రి ఇప్పుడు ఆమె చనిపోయిన తర్వాత ఆమె సమాధి వద్ద నృత్యం చేస్తున్నాడు. హిజాబ్ కోసం వ్యక్తులను ఉరితీయడానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలలో ఆమె చనిపోయింది." అంటూ ఈ వీడియో ను షేర్ చేస్తున్నారు.

https://www.facebook.com/shakir.karim.315/videos/780722539827670/

https://www.facebook.com/reel/472955051409393?s=yWDuG2&fs=e

https://www.facebook.com/reel/830563077976291?s=yWDuG2&fs=e



వాట్సాప్‌తో సహా పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ వాదన వైరల్‌గా మారింది.

నిజ నిర్ధారణ:

మహ్సా అమినీ తండ్రి తన కుమార్తె అంత్యక్రియల ముందు డ్యాన్స్ చేస్తున్నట్లు వీడియో చూపుతోందనే వాదన అవాస్తవం. వీడియో అజర్బైజాన్ టీవీ సిరీస్ నుండి క్లిప్‌ను చూపుతోంది.

వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్‌లను ఉపయోగించి గూగుల్ రివర్స్ ఇమేజ్ శోధనను నిర్వహించినప్పుడు, ఫేస్బుక్ లో టర్కిష్ భాషలో పోస్ట్ చేయబడిన వీడియో లభించింది. ఇది తన కుమార్తె అంత్యక్రియలలో నృత్యం చేసిన వ్యక్తి కథ అంటూ అనువాదంలో తెలుస్తోంది.

https://www.facebook.com/musmerkezz/videos/885625172024379/

4 సంవత్సరాల క్రితం ప్రసారమైన అటా ఓకాగి అనే టీవీ డ్రామా నుండి తీసుకున్న వీడియో అంటూ ట్వీట్ చేసిన కావిడ్ అగా అనే జర్నలిస్ట్ చేసిన ట్వీట్ కూడా లభించింది. వీడియోలో ఉన్న వ్యక్తి ఒక నటుడు, అతని పేరు గుర్బన్ ఇస్మాయిలోవ్.

కావిద్ ఆగా ట్వీట్ ఇలా సాగుతుంది: ఈ వ్యక్తి నాకు వ్యక్తిగతంగా తెలిసిన నటుడు. అతని పేరు గుర్బన్ ఇస్మాయిలోవ్, ఈ దృశ్యం 4 సంవత్సరాల క్రితం ప్రసారమైన అటా ఓకాగి అనే ప్రసిద్ధ టీవీ డ్రామా నుండి వచ్చింది.

టివి సిరీస్ ఆట ఓకాగి కోసం శోధించినప్పుడు, వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తిని వీడియోల శ్రేణిలో చూడవచ్చు. ఈ సీరియల్ వీడియోలను క్సెజర్ ఫిల్మ్ అనే యూట్యూబ్ ఛానెల్ పోస్ట్ చేసింది.

Full View

యూట్యూబ్ ఛానెల్ క్సెజర్ ఫిల్మ్‌ని శోధించినప్పుడు, వైరల్ వీడియోలో కనిపించే సీక్వెన్స్ ఉన్న సిరీస్ ఎపిసోడ్‌ లభించింది. వైరల్ డ్యాన్స్ సీక్వెన్స్ 18.40 నిమిషాల నుంచి 20.07 నిమిషాల వరకు చూడొచ్చు. ఈ వీడియో జనవరి 9, 2018న పోస్ట్ చేసారు.

గుర్బన్ ఇస్మాయిలోవ్ కోసం శోధించినప్పుడు, వీడియోలో ఒకే వ్యక్తిని చూపుతున్న అనేక చిత్రాలు కనిపించాయి. ఏపిఏ.ఏజెడ్ అనే వెబ్‌సైట్, 'పీపుల్స్ ఆర్టిస్ట్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ అజర్‌బైజాన్ గుర్బన్ ఇస్మాయిలోవ్' శీర్షికతో ఫోటో బ్లాగును కూడా ప్రచురించింది.

అందుకే, అమినీ తండ్రి తన కుమార్తె అంత్యక్రియల ముందు డ్యాన్స్ చేశాడనే వాదన అబద్దం. వీడియో క్లిప్ అజర్‌బైజాన్ టీవీ సిరీస్‌లోనిది.

Claim :  Viral video claiming dance by Amini's father at her funeral
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News