ఫ్యాక్ట్ చెక్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా పాకిస్థాన్ మధ్యవర్తిత్వం చేయడాన్ని శశిథరూర్ ప్రశంసించలేదు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా పాకిస్థాన్ మధ్యవర్తిత్వం చేయడాన్ని శశిథరూర్

Update: 2026-04-11 06:01 GMT

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా - ఇరాన్ ప్రతినిధుల మధ్య ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే అమెరికా ప్రతినిధుల బృందం పాక్ చేరుకోగా, ఇరాన్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఇస్లామాబాద్ వచ్చేసింది. ఒక కీలకమైన దౌత్య దశ ప్రారంభమైనట్లు సూచిస్తూ, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఖాలిబాఫ్ నేతృత్వంలోని ఇరాన్ సంప్రదింపుల బృందం అమెరికాతో శాంతి చర్చల కోసం ఇస్లామాబాద్‌కు చేరుకుందని ఇరాన్ మీడియా కూడా నివేదించింది. "పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఖాలిబాఫ్ నేతృత్వంలోని ఇరాన్ సంప్రదింపుల బృందం అమెరికాతో శాంతి చర్చల కోసం ఇస్లామాబాద్‌కు చేరుకుంది," అని ఇరాన్ మీడియా తెలిపింది. టెహ్రాన్ ముందస్తు షరతులను వాషింగ్టన్ అంగీకరిస్తేనే చర్చలు ముందుకు సాగుతాయని కూడా అది స్పష్టం చేశారు.

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం ఈ చర్చల్లో పాల్గొనడానికి పాక్ చేరుకుంది. ఈ బృందంలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ సన్నిహితులు స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ కూడా ఉన్నారు. ఇరాన్ నిజాయితీగా చర్చలకు వస్తే తమ మద్దతు ఉంటుందని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని అమెరికా హెచ్చరించింది.
అయితే మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్ పై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ప్రశంసలు కురిపిస్తున్నట్లుగా ఉన్న ఓ వీడియో విస్తృతంగా షేర్ అవుతోంది. శశి థరూర్ ఇండియా టుడేకు చెందిన రాజ్‌దీప్ సర్దేశాయ్‌తో మాట్లాడుతూ, ఇరాన్ యుద్ధాన్ని ముగించడానికి పాకిస్థాన్ జోక్యం చేసుకుందని, ఇది భారత ప్రభుత్వం చేసిన ఒక భారీ వ్యూహాత్మక వైఫల్యంలా అనిపిస్తోందని చెప్పినట్లుగా అందులో ఉంది.

వైరల్ పోస్టుకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు


స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది



 


ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

ఇటీవలి కాలంలో శశిథరూర్ పాకిస్థాన్ పై ప్రశంసలు కురిపించారా అని తెలుసుకోవడం కోసం మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. అయితే మాకు ఎలాంటి నివేదికలు లభించలేదు.

అయితే డిసెంబర్ 26, 2025 నాటి ఇండియా టుడే యూట్యూబ్ ఛానెల్‌లో “Shashi Tharoor Defends Praising PM Modi’s Diplomacy” అనే శీర్షికతో ఉన్న 30 నిమిషాల ఇంటర్వ్యూ ఒకటి దొరికింది. సర్దేశాయ్, థరూర్‌ల దుస్తుల నుండి నేపథ్యం వరకు, ఈ వీడియోలోని దృశ్యాలు వైరల్ క్లిప్‌తో సరిపోలాయి. ఒరిజినల్ వీడియోను ఇక్కడ చూడొచ్చు.


Full View



వైరల్ క్లిప్‌లోని థరూర్ వ్యాఖ్యలు మొత్తం ఇంటర్వ్యూలో ఎక్కడా లేవు. అమెరికా అధ్యక్షుడి అనూహ్య చర్యలు, సుంకాలు భారతదేశంతో సహా ప్రపంచంపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయని అందులో చెప్పారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్థాన్ సైనిక వైఖరి, బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న భారత్ వ్యతిరేక సెంటిమెంట్ల గురించి ఆయన మాట్లాడారు.

ఇక వైరల్ వీడియో ఈ ఇంటర్వ్యూను ఉపయోగించి సృష్టించిన డీప్‌ఫేక్ వీడియో అని సూచించింది. ఆ వీడియో హైవ్ ఏఐ డిటెక్టర్‌లో విశ్లేషించగా, ఆ స్వరం కృత్రిమమైనదని నిర్ధారణ అయింది.



 



ఇక శశిథరూర్ కూడా వైరల్ వీడియో ఫేక్ అంటూ ఏప్రిల్ 9న ట్వీట్ చేశారు. తనకు సంబంధించిన పలు డీప్ ఫేక్ వీడియోలు ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. దయచేసి నమ్మొద్దని సూచించారు.





ఇక ఇండియా టుడే ఫ్యాక్ట్ చెక్ టీమ్ కూడా వైరల్ పోస్టుల్లో ఎలాంటి నిజం లేదంటూ తెలిపాయి. అందుకు సంబంధించిన లింక్ ను ఇక్కడ చూడొచ్చు.

కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. శశిథరూర్ కు సంబంధించిన డీప్ ఫేక్ వీడియోను నిజమైనదిగా ప్రచారం చేస్తున్నారు.


Claim :  వైరల్ వీడియో లోని ఆడియో డీప్ ఫేక్ గా గుర్తించాం
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News