ఫ్యాక్ట్ చెక్: నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ప్రతీ నెల 2500 రూపాయలు ఇస్తామని ప్రకటించలేదు

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ప్రతీ నెల 2500 రూపాయలు

Update: 2026-02-13 05:16 GMT

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు త్రైమాసికాలలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ మొత్తంలో 40% కంటే కొంచెం ఎక్కువ ఖర్చు చేసింది. అయితే సంవత్సరం చివరి నాటికి 75% కంటే తక్కువ ఖర్చు చేయాలని ఆశిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం మూడు త్రైమాసికాల (9 నెలలు) కాలంలో కేవలం 40 శాతం కన్నా కొంచెం ఎక్కువ మాత్రమే నిధులను ఖర్చు చేశారు. ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఇది 75 శాతానికి చేరుతుందని అంచనా వేస్తున్నారు. 53 ప్రధాన పథకాలకు రూ.500 కోట్లు, అంతకన్నా ఎక్కువ కేటాయించారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కింద చేపట్టే మౌలిక సదుపాయాల నిర్వహణా పథకాలు, ఇందిరా గాంధీ జాతీయ వితంతు పెన్షన్‌ పథకం, ఎస్‌ఎస్‌సీ, ఇతరులకు ఇచ్చే ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ ఈ మూడు పథకాలకు మాత్రమే సవరించిన అంచనా(ఆర్‌ఈ), బడ్జెట్‌ అంచనా మొత్తానికి సమానంగా ఉంది. కొన్ని పథకాలకు కేటాయించిన నిధుల్లో 10 శాతం కూడా ఖర్చు చేయలేదు. జలజీవన్‌ మిషన్‌/నేషనల్‌ రూరల్‌ డ్రింకింగ్‌ వాటర్‌ మిషన్‌కు రూ.67,000 కోట్లను కేటాయించగా, కేవలం రూ.31 కోట్లను మాత్రమే ఖర్చు చేశారు.

అయితే కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు 2500 రూపాయలు ఇవ్వనుందంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 'బెరోజ్‌గరి భట్టా యోజన' అంటూ పోస్టులు పెట్టారు.

"ఈ పథకం ప్రధాన లక్ష్యం దేశంలో ఉపాధి కోసం వెతుకుతున్న విద్యావంతులైన యువతకు నిరుద్యోగ భృతి రూపంలో ఆర్థిక సహాయం అందించడం. ఆర్థిక సంక్షోభం కారణంగా విద్యావంతులు, ప్రతిభావంతులు కానీ ప్రభుత్వ ఉద్యోగాలకు లేదా ఇతర ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి తగినంత ఆదాయాన్ని సంపాదించలేని వారికి ఈ పథకం సహాయపడుతుంది." అంటూ పోస్టులు పెడుతున్నారు.

వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇక్కడ ఉన్నాయి.



 



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వం అలాంటి పథకాన్ని తీసుకుని వచ్చినట్లుగా మాకు ఎలాంటి కథనం కూడా లభించలేదు. ఒకవేళ ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకుని ఉండి ఉంటే అది తప్పకుండా వార్తా కథనాల్లో స్థానం సంపాదించుకుని ఉండేది.

ఇక మేము ప్రభుత్వానికి సంబంధించిన పలు అధికారిక ఖాతాలను కూడా పరిశీలించాం. అందులో ఎక్కడా కూడా ఈ పథకానికి సంబంధించిన వివరాలు లభించలేదు.

https://india.gov.in/my-government/schemes


మా తదుపరి పరిశోధనలో ఈ వాదన నకిలీదని PIB ఫ్యాక్ట్ చెక్ సంస్థ పేర్కొంది. ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అయ్యే తప్పుదారి పట్టించే వీడియోలు, లింక్‌లకు నమ్మవద్దని హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా అలాంటి పథకం ఏదీ రాలేదని PIB ఫ్యాక్ట్ చెక్ సంస్థ స్పష్టం చేసింది.



కేంద్రం ప్రభుత్వం ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు నెలవారీ నగదు బదిలీలను అందించదు. ఈ పోస్ట్ లు పూర్తిగా కల్పితం. ప్రజలను తప్పుదారి పట్టించడానికి ఉద్దేశించినది. ఇటువంటి తప్పుడు వాదనలు దోపిడీ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటాయని గుర్తుంచుకోవాలి. మోసగాళ్ళు తరచుగా అధికారిక ప్రభుత్వ ప్రకటనలను పోలి ఉండే వీడియోలు ,పోస్ట్‌లను సృష్టిస్తారు. వినియోగదారుల నుండి వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని దొంగిలించడానికి ఈ వ్యూహాన్ని ఉపయోగిస్తారు.

కొన్ని రాష్ట్రాలలో నిరుద్యోగులకు సహాయ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు రాష్ట్ర నిర్వహణ సంక్షేమ పథకాల కింద అర్హత కలిగిన విద్యావంతులైన యువతకు నెలకు ₹2,500 వరకు భత్యాలను అందిస్తూ ఉన్నాయి.

కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. దయచేసి అలాంటి వాటిని నమ్మి క్లిక్ చేయొద్దు.


Claim :  వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News