ఫ్యాక్ట్ చెక్: అంధ జంట పెళ్లి వీడియోను తప్పుడు వాదనతో షేర్ చేస్తున్నారు

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియోలో ఉన్నది అంధులైన జంట

Update: 2026-04-13 04:21 GMT

ఏదైనా సంచలన ఘటన చోటు చేసుకుంటే, తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ప్రజలు సోషల్ మీడియాపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో సోషల్ మీడియాను ఉపయోగించడం అనేది చాలా రిస్క్ తో కూడుకున్నది కూడా!! ముక్కలు ముక్కలుగా వెలువడే కొత్త సమాచారం వదంతులను ప్రోత్సహించవచ్చు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులు చాలా సమస్యలను కూడా కొనితెచ్చిపెడతాయి. ప్రతి సంఘటనకు సంబంధించిన వదంతులను గుర్తించడం, అలాగే ప్రతి వదంతిని నిజం లేదా అబద్ధంగా నిర్ధారించిన సాక్ష్యాలను గుర్తించడం చాలా అవసరం. వదంతులు అబద్ధమని తేలిపోయిన తర్వాత వాటిని వినియోగదారులు ఖండించే సందర్భాలు కూడా చాలా తక్కువే!! వివిధ రకాల వినియోగదారుల పాత్ర మన సోషల్ మీడియా వినియోగంలో భాగమై ఉంటుంది.


చనిపోయిన వధువు మెడలో తాళికట్టిన ఘటన అంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. "ఉత్తర ప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో పెళ్లికి ముందు వధువు ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియాంక, సన్నీ లు ఇద్దరుప్రేమించుకున్నారు. మూడేళ్లకు పైగా ఇద్దరం ప్రేమించుకున్నట్లు చెప్పాడు. ప్రియాంక ఇంట్లో అద్దెకు ఉన్నప్పుడు సన్నీ తొలిసారి ఆమెను కలిశాడు. అప్పటి నుంచి ప్రేమ మొదలైంది. ఆ తర్వాత అక్కడే ఒక మొబైల్ దుకాణాన్ని తెరిచాడు. ఆమె కోసమే తన జీవితం అన్నట్లు ఉండేవాడు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు అంగీకరించాయి. ఈ జంటకు గతేడాది గ్రాండ్ గా ఎంగెజ్ మెంట్ కూడా జరిగింది. 2025 నవంబర్ 29న వివాహం జరగాల్సి ఉంది. కానీ అనూహ్యంగా వాయిదా పడింది. ఇటీవల వీరి పెళ్లికి అంతా రెడీ చేశారు. ఏమైందో తెలియదు. పెళ్లికి కొన్నిగంటలకు ముందు వధువు ప్రియాంక అనూహ్యంగా ఆత్మహత్య చేసుకుంది. దీంతో అందరు షాక్ అయ్యారు. పెళ్లిళ్లు కాస్త పెనువిషాదకరంగా మారిపోయింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ క్రమంలో వరుడు మాత్రం తాను ప్రియాంకను మనసారా ప్రేమించానని, ఆమెను పెళ్లాడతానని చెప్పాడు. చనిపోయిన ఆమెను వధువులా అందంగా దుస్తులు వేసి, జువెల్లరీ వేసి మరీ పీటల మీద కూర్చొబెట్టారు. అతను ఆమెను మూడు మూళ్లు వేశాడు. యువతి మీద తనకున్న ప్రేమను చాటుకున్నాడు. అక్కడున్న వారంతా ఈ ఘటనను చూసి మరింత భావొద్వేగంకు గురయ్యారు. చిన్న చిన్న కారణాలతో భార్యలను, భర్తలను చంపుకునే ప్రస్తుత సమాజంలో చనిపోయిన యువతిని పెళ్లాడంను చూసి ఎమోషనల్ అవుతున్నారు. వీడు నిజమైన మగజాతీ ఆణిముత్యం, వీరిది నిజమైన ప్రేమ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు." అంటూ కథనాలను వైరల్ చేశారు.

వైరల్ పోస్టుకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.

వైరల్ ఘటనకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది.



 



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ పోస్టుల్లో ఉన్న జంటకు కళ్ళు కనిపించవు.

వైరల్ పోస్టు లోని స్క్రీన్ షాట్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. ఇది కళ్ళు కనిపించని జంటకు సంబంధించిన వీడియో అని పలువురు నెటిజన్లు చెప్పడం మనం చూడొచ్చు.






వైరల్ విజువల్స్ రెండు వివిధ ఘటనలకు సంబంధించిన వీడియో అంటూ కూడా @Delhiite_ అనే ట్విట్టర్ ఖాతాలో వివరించారు.



వైరల్ వీడియోలోని జంట అదే పెళ్లి బట్టల్లో ఉన్న వివిధ వీడియోలు మాకు సోషల్ మీడియాలో కనిపించాయి.

https://www.instagram.com/reels/DW31sJPkmgQ/

ఇక పెళ్లి కుమార్తెను మండపం దగ్గరకు తీసుకుని వెళ్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు





ఇక వైరల్ పోస్టుల్లో చెబుతున్న ప్రియాంక, సన్నీకి సంబంధించిన పెళ్లి కథనాలు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.



 



2025, జూన్ నెలలో చోటు చేసుకున్న ఘటనను ఈ పెళ్ళికి ఆపాదిస్తూ పోస్టులు చేశారు.

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.


Claim :  వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియోలో ఉన్నది అంధులైన జంట
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News