ఫ్యాక్ట్ చెక్: బిరియానీ లో గర్భ నిరోధక ట్యాబ్లెట్లను కలుపుతూ ఉన్నారా..?

తమిళనాడులోని కోయంబత్తూరు నగరంలో ఒక ముస్లిం వ్యక్తి గర్భ నిరోధక, నపుంసకత్వానికి కారణమయ్యే ట్యాబ్లెట్లు వేసి హిందువులకు బిర్యానీ విక్రయిస్తున్నాడని పేర్కొంటూ ఫేస్‌బుక్ వినియోగదారులు ఫోటోలను పోస్ట్ చేశారు.

Update: 2022-02-09 05:00 GMT

తమిళనాడులోని కోయంబత్తూరు నగరంలో ఒక ముస్లిం వ్యక్తి గర్భ నిరోధక, నపుంసకత్వానికి కారణమయ్యే ట్యాబ్లెట్లు వేసి హిందువులకు బిర్యానీ విక్రయిస్తున్నాడని పేర్కొంటూ ఫేస్‌బుక్ వినియోగదారులు ఫోటోలను పోస్ట్ చేశారు.


నాలుగు ఫోటోలతో పాటు పోస్ట్ చేసిన హిందీ టెక్స్ట్ అనువాదం ఇలా ఉంది, "కోయంబత్తూరులో, ఒక ముస్లిం ఫాస్ట్ ఫుడ్ జాయింట్ లో రెండు వేర్వేరు పాత్రలలో బిర్యానీ వండారు, ఒకటి ముస్లింలకు, మరొకటి హిందువులకు కేటాయించబడింది. హిందువుల పాత్రలో, ముస్లిం వంటవాడు నపుంసకత్వపు మాత్రలను కలుపుతాడు, దీంతో హిందూ అబ్బాయిలు, అమ్మాయిలు సంతానం పొందలేరు. దీంతో మొత్తం హిందూ జనాభా తగ్గుతుంది. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ఇంకా పెద్దది. జిహాదీలు మిమ్మల్ని ఎంత దారుణంగా చుట్టుముట్టారో ఆలోచించండి. హిందువులను నిర్మూలించడానికి జిహాద్ ఎలా జరుగుతుందో తెలుసుకోకుండా హిందువులు నిద్రపోతున్నారు. హిందువులను మేల్కొలపడానికి ప్రయత్నించే వ్యక్తులను అంతం చేస్తున్నారు. ఈ రోజు నుండి మీరు వారి నుండి ఎటువంటి వస్తువులను కొనుగోలు చేయరని ప్రతిజ్ఞ చేయండి" అంటూ ఆ పోస్టుల్లో తెలిపారు.


బిర్యానీ వడ్డిస్తున్న వ్యక్తిని చూపిస్తూ సంబంధం లేని కొన్ని చిత్రాలు ఉన్నాయి. బాక్స్‌లలో పెద్ద మొత్తంలో ట్యాబ్లెట్‌లు, పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు.. ఇలా కొన్నిటిని ఉంచి హిందువులపై చేస్తున్న దాడులు అంటూ ప్రచారం చేస్తున్నారు.

నిజ నిర్ధారణ:

మొదటగా ఈ వైరల్ పోస్టులు 'ఫేక్ న్యూస్' అని కోయంబత్తూరు పోలీసులు తెలిపారు.
వైరల్ అవుతున్న ఫోటోలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఆ ఫోటోలు భారత్, శ్రీలంక సంబంధించినవి.
ఓ వ్యక్తి బిరియానీని పట్టుకుని ఉన్నది.. జూన్ 30, 2016న యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వీడియో "Indian Muslim festival DUM BIRYANI Preparation for 30 People & STREET FOOD" కి సంబంధించిన థంబ్నైల్ ఫోటో..!
Full View
Daily Mirror Sri Lanka అప్లోడ్ చేసిన ట్యాబ్లెట్లకు సంబంధించిన ఫోటో ఇది. కొలంబోలో రూ.కోట్ల విలువైన డ్రగ్స్ నిల్వ చేసినందుకు తండ్రీకొడుకులను పోలీసులు పట్టుకున్నారు. ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలను గర్భ నిరోధక మాత్రలంటూ ఈ వైరల్ ఫోటో ద్వారా ప్రచారం చేస్తున్నారు.
కోయంబత్తూరు సిటీ పోలీసులు వైరల్ పోస్టులు అని.. నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్నందున ఎవరూ నమ్మవద్దని పేర్కొన్నారు. మతపరమైన క్యాప్షన్‌తో చిత్రాలను పోస్ట్ చేసిన హ్యాండిల్‌ను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని కూడా తెలిపారు.

Claim :  Images show Coimbatore restaurant serving biriyani to Hindus laced with impotency tablets.
Claimed By :  RD Singh
Fact Check :  Unknown
Tags:    

Similar News