ఫ్యాక్ట్ చెక్: రైలులో సీట్ కోసం గొడవ అంటూ స్క్రిప్టెడ్ వీడియోను నిజమైన ఘటనగా షేర్ చేస్తున్నారు

రైలులో సీట్ కోసం గొడవ అంటూ స్క్రిప్టెడ్ వీడియోను నిజమైన ఘటనగా..

Update: 2026-03-20 15:16 GMT

భారతీయ రైల్వే రోజూ కోట్ల మంది ప్రజలను వారి గమ్యస్థానాలకు చేరుస్తూ ఉంది. రైల్వే స్టేషన్లు, ట్రైన్ల విషయంలో కూడా ప్రభుత్వం చాలా మార్పులకు శ్రీకారం చుడుతోంది. భారతీయ రైల్వేల రూపురేఖలను సమూలంగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "అమృత్ భారత్ స్టేషన్" పథకం ఇప్పుడు దేశవ్యాప్తంగా పర్యాటక, రవాణా రంగాల్లో కొత్త విప్లవాన్ని సృష్టిస్తోంది. సాధారణ ప్రయాణికులకు కూడా అంతర్జాతీయ స్థాయి వసతులను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా రైల్వే శాఖ ప్రయత్నిస్తోంది. కేవలం మెరుగులు దిద్దడమే కాకుండా, స్టేషన్ల మౌలిక సదుపాయాలను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఆధునీకరిస్తున్నారు.


దేశవ్యాప్తంగా ఉన్న చిన్న, మధ్య తరహా మరియు పెద్ద రైల్వే స్టేషన్లను దశలవారీగా ఆధునీకరించడానికి అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని రూపొందించారు. భారత ప్రభుత్వం సుమారు 1,300 కంటే ఎక్కువ స్టేషన్లను గుర్తించింది. ఈ పథకం కింద కేటాయించిన నిధులను స్టేషన్ల ప్రవేశ ద్వారాల అభివృద్ధి, వెయిటింగ్ హాల్స్, టాయిలెట్లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు మరియు ఉచిత వైఫై వంటి వసతుల కోసం ఖర్చు చేస్తున్నారు.

ఓ వైపు ప్రభుత్వం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంటే కొందరు వ్యక్తుల ప్రవర్తన కారణంగా విమర్శలు కూడా ఎదురవుతూ ఉన్నాయి. ముఖ్యంగా రైల్లో ప్రయాణించే సమయంలో డస్ట్ బిన్స్ ను సరిగా వినియోగించకపోవడం, టాయ్ లెట్స్ ను అపరిశుభ్రంగా ఉంచడం లాంటి ఎన్నో అంశాల పట్ల ప్రజలకు ఇంకా అవగాహన రావడం లేదు. ఇక సీట్ల కోసం గొడవలు పడే వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి.

తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

ఈ ఘటనకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు

వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు




 

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. స్క్రిప్టెడ్ వీడియోను నిజమైన ఘటనగా షేర్ చేస్తున్నారు.

రైలు కోచ్‌లో ముగ్గురు మహిళా ప్రయాణికుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సీట్ల కేటాయింపు విషయంలో ప్రయాణికులు తీవ్ర వాగ్వాదానికి దిగడం, శారీరక దాడికి దారితీయడం ఈ వీడియోలో చూడొచ్చు. , ఈ గొడవలో పాల్గొన్న ముగ్గురు మహిళలలో ఒకరితో మరో పురుష ప్రయాణికుడు ఘర్షణకు దిగడంతో పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చడం కూడా ఈ వీడియోలో కనిపిస్తుంది.

అయితే వీడియోను నిశితంగా పరిశీలించగా ఇతర ప్రయాణీకులు ఆందోళన చెందకుండా నవ్వుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు.

గూగుల్ లెన్స్ ద్వారా సెర్చ్ చేయగా “poonam_devi120” అనే యూజర్‌నేమ్‌తో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియో మాకు లభించింది. మార్చి 13, 2025న ఈ వీడియో మొదట అప్లోడ్ చేశారు. వైరల్ వీడియోకు మూలం ఈ హ్యాండిలే అని కనుగొన్నాం.

అయితే, ఆ పోస్ట్‌తో పాటు పంచుకున్న వివరణను విశ్లేషించగా, ఆ వీడియో స్క్రిప్ట్ ప్రకారం రూపొందించామని, వినోద ప్రయోజనాల కోసం అప్లోడ్ చేసినట్లుగా ఆ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ముందే పేర్కొన్నారు. కేవలం యాక్టింగ్ మాత్రమే అంటూ అందులో తెలిపారు.



ఆ అకౌంట్ ఒక రీల్ క్రియేటర్ కు సంబంధించింది. ఒక మిలియన్ కు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

https://www.instagram.com/poonam_devi120/



 

అదే డ్రెస్ లో యాక్టింగ్ చేసిన మరో రీల్ కూడా మేము గమనించాం. ఇందులో కూడా రైలులో మరో ప్యాసెంజర్ తో గొడవ పెట్టుకున్నట్లుగా వీడియోను తీశారు.




ఆమె సోషల్ మీడియా ఖాతాలో పలు వీడియోలు రైలులో ప్రయాణానికి సంబంధించినవి ఉన్నాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.

పలువురు నటీనటులు ఇతర వీడియోలలో కూడా చూడొచ్చు.

రైలు బోగీలో ముగ్గురు మహిళా ప్రయాణికులు ఘర్షణ పడుతున్నట్లు చూపించే ఒక వీడియో, నిజమైన సంఘటనగా సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. అయితే, ఈ వీడియో స్క్రిప్టెడ్. వినోదం కోసం ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ దీన్ని పోస్ట్ చేశారని మేము కనుగొన్నాం.

వీక్షకులను తప్పుదోవ పట్టించేందుకు ఈ వైరల్ క్లిప్‌ను ఆన్‌లైన్‌లో తప్పుగా షేర్ చేశారు. కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.


Claim :  రైలులో సీటు కోసం గొడవ పడుతున్న ప్యాసెంజర్లు,. వీడియో నిజమైనది కాదు. ఇది స్క్రిప్టెడ్ వీడియో
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News