Srisailam : శ్రీశైలంలో ఆలయం మూసివేత

చంద్రగ్రహణం సందర్భంగా మార్చి 3న శ్రీశైలం ఆలయాన్ని మూసివేయనున్నారు.

Update: 2026-02-25 04:24 GMT

మార్చి 3 తేదీన పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. మార్చి తెల్లవారుజామున 4.30 నుంచి 6 గంటలోపు శ్రీశైల ఆలయంలో దర్శనాలు ఉంటాయి. తిరిగి రాత్రి 9 గంటలకు దర్శనాలు ప్రారంభమయి 10 గంటల వరకు ఉంటాయి, మార్చి 3 న ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు శ్రీశైల దేవస్థానం దర్శనాలు నిలిపివేస్తామని ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన ఆలయంతో పాటు అన్ని ఉప ఆలయాలు, స్వామి అమ్మవారి దర్శనాలు నిలిపివేయడం జరుగుతుందని శ్రీశైలం ఆలయ అధికారులు తెలిపారు.

గ్రహణం సందర్భంగా...
గ్రహణ అనంతరం సంప్రోక్షణ వివిధ కార్యక్రమాల అనంతరం తిరిగి దర్శనాలు ప్రారంభించడం జరుగుతుందని చెప్పారు. గ్రహణ కాలం 3 గంటల 28 నిమిషాలు పాటు ఉందని, గ్రహణం మధ్యాహ్నం 3.20 కి మొదలై.. సాయంత్రం 6.48 కి ముగుస్తుందని తెలిపారు. గ్రహణ కాలం అత్యంత పుణ్య కాలం.. ఈ సమయంలో చేసే జపాలు దానాలు ఎన్నోరేట్ల ఫలితాన్ని కలిగిస్తాయని, సాత్విక మంత్రాలు మినహాయించి మిగతా మంత్రాలు చేసుకోవాలని, అలాగే గ్రహణ కాలంలో పవిత్ర పాతాళ గంగ నదిలో స్నానం చేయడం అత్యున్నత ఫలితాన్ని కలిగిస్తుందని పండితులు తెలిపారు.


Tags:    

Similar News