Sabarimala : నేడు శబరిమల ఆలయం తెరుచుకోనున్న తలుపులు
శబరిమలలో నేడు ఆలయాన్ని తెరవనున్నారు
శబరిమలలో నేడు ఆలయాన్ని తెరవనున్నారు. నేడు ఆరట్టు ఉత్సవం నిర్వహిస్తున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు సన్నిధానం నుంచి అంబారితో ప్రస్థానం ప్రారంభమవుతుంది. ఉదయం 11 గంటలకు పంబ నది వద్ద పవిత్ర స్నానం ఉంటుంది. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు తిరుగు ప్రయాణం ఉండనుంది.
రాత్రి పది గంటలకు...
నీలిమలలో భక్తులు , వ్యాపారులు ఘన స్వాగతం పలుకుతారు. ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు దీపారాధన కోసం ఆలయం తిరిగి తెరుస్తారు, రాత్రి తొమ్మిది గంటలకు ధ్వజావరోహణంతో ఉత్సవ ముగింపునకు చేరుకుంటుంది. రాత్రి పది గంటలకు హరివరాసనం తరువాత ఆలయం మూసివేయనున్నారు.